గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (09:42 IST)

సౌమ్య సర్కారు ఎవరు.. ఆయన పెళ్లిలో ఏం జరిగింది?

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ సౌమ్య సర్కార్ పెళ్లిలో మొబైల్ ఫోన్లు మాయం కావడం వివాదాస్పదమైంది. ఈ నెల 26న 19 ఏళ్ల ప్రియోంటి దేబ్‌నాథ్‌ను సౌమ్య సర్కార్ పెళ్లాడాడు. దేబ్‌నాథ్‌ను పెళ్లాడి కొత్త  ఇన్నింగ్స్ మొదలుపెట్టిన క్రికెటర్‌కు ఈ వేడుక చేదు అనుభవాన్ని మిగిల్చింది. పెళ్లికి హాజరైన వారిలో కొందరు దొంగలు అతిథుల ఫోన్లను చాకచక్యంగా దొంగిలించారు.
 
అంతే గందరగోళం నెలకొంది. బాధితుల్లో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, క్రికెటర్ తండ్రి కూడా ఉన్నాడు. అప్రమత్తమైన బాధితులు ఫోన్లు దొంగిలించినట్టుగా భావిస్తున్న అనుమానితులను పట్టుకున్నారు. దీంతో దొంగల గ్యాంగు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై దాడికి దిగింది. ఫలితంగా వేడుకలో రచ్చ మొదలైంది.
 
పెళ్లి కాస్తా రసాభాసగా మారింది. గొడవ మరింత ముదరడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో మిగతా పెళ్లి తంతు సజావుగా సాగింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.