గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (15:22 IST)

త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ

ganguly
త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. దీనిపై త్రిపుర సీఎం మాణిక్ సాహా మాట్లాడుతూ.. తమ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వుండాలనే ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగిన విషయమని తెలిపారు. 
 
గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని వెల్లడించారు. గంగూలీతో ఫోన్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. గంగూలీ మాట్లాడుతూ... త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలను చేపట్టబోతున్నానని ప్రకటించారు.