గంగూలీ త్యాగం ధోనీకి వరం .. ఏంటది?

సోమవారం, 9 అక్టోబరు 2017 (07:49 IST)

dhoni - ganguly

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో గొప్ప ఫినిషర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు గడించారు. ధోనీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎవరున్నారనే అంశాన్ని డీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బహిర్గతం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... సౌరవ్ గంగూలీ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయకపోతే మహీ ఇంతలా ఎదిగేవాడు కాదన్నారు. ప్రస్తుతం ధోనీ అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతులకు దాదాయే కారణమన్నాడు. ఆ సమయంలో మేం బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయాలని అనుకున్నాం. ఓపెనింగ్‌లో మంచి భాగస్వామ్యం వస్తే మూడో నంబర్‌లో గంగూలీ బ్యాటింగ్‌కు రావాలి. ఒకవేళ మంచి ఆరంభం లభించకపోతే ఫించ్ హిట్టర్‌గా ఇర్ఫాన్ లేదా ధోనీలలో ఒకర్ని పంపి స్కోరు పెంచాలన్నది లక్ష్యం. 
 
చాలాసార్లు ఓపెనింగ్ విఫలంకావడంతో దాదా.. ధోనీని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాడు. గంగూలీ గనుక ఆ అవకాశం ఇవ్వకపోతే ధోనీ ఇంత గొప్ప ప్లేయర్ కాకపోయేవాడు అని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీని ప్రమోట్ చేయాలన్నది పూర్తిగా గంగూలీ నిర్ణయమేనని స్పష్టం చేశాడు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు చాలా తక్కువ మంది కెప్టెన్లు తీసుకుంటారని ప్రశంసించాడు. కొత్త ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నది గంగూలీ నమ్మిన సిద్ధాంతమని వీరూ చెప్పాడు. 
 
మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో ధోనీని మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని గంగూలీ నిర్ణయించుకున్నాడు. ముందుగా తన ఓపెనింగ్ స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ధోనీని ప్రమోట్ చేశాడు. ఏ కెప్టెన్ ఇంత ధైర్యం చేయరు. కానీ దాదా చేశాడు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతోనే ధోనీని ముందుకు తీసుకొచ్చాడు. అదే మహీ పాలిట వరంగా మారింది. ఇప్పుడు ఇంత గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు సెహ్వాగ్ వివరించాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ...

news

రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా ...

news

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ...

news

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ...