శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (07:22 IST)

నెక్ టు నెక్... భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

తొలి టీ20 మ్యాచ్‌లో ఉత్కంఠభరిత వాతావరణం మధ్యన భారత్‌పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా19.4 ఓవర్లలో 200 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ జేపీ డుమిని చివర్లో దూకుడుగా ఆడాడు. 34బంతుల్లో ఒక్క ఫోర్, నాలుగు సిక్సర్లు బాది 68 పరుగలతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదే దక్షిణాఫ్రికా గెలుపునకు ప్రాణం పోసింది. 
 
టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (3) తక్కువ పరుగులకే రనౌటయ్యాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మెరుపు సెంచురీ సాధించాడు. దీంతో భారత్‌ నిర్ణీత 199 పరుగుల చేయగలిగింది. రోహిత్‌ శర్మ కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఇతనికి విరాట్ కోహ్లీ తోడవడంతో స్కోరును 150 పరుగుల వరకూ వికెట్ కోల్పోకుండా వేగంగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జంట రెండో వికెట్‌కి ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 
 
అయితే 16వ ఓవర్‌‌లో ఇద్దరినీ అబాట్‌ వీరిద్దరినీ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ దారిపట్టించాడు. తరువాత వచ్చిన చివర్లో రైనా (14), రాయుడు (0) తడబాటుతో కొంత ఇబ్బంది పడే పరిస్థితే నెలకొంది. ధోని 20 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. తరువాత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన దక్సిణాఫ్రికా 19.4 ఓవర్లలోనే 200 పరుగులు చేసి తన భారత్‌పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ బాల్ టు బాల్ ఉత్కంఠ భరితంగా సాగింది.