Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ట్వంటీ20 సిరీస్ : నేడు ఫైనల్ మ్యాచ్

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:54 IST)

Widgets Magazine

సిరీస్‌లో భాగంగా, ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో పర్యాటక భారత్ జట్టు నేడు తుది సమరంలో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచి.. సౌతాఫ్రికా గడ్డపై ఆధిపత్యం సాధించాలని కసితో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. తద్వారా చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నారు కుర్రోళ్లు.
 
ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. అదే ఊపు ట్వంటీ20 సిరీస్‌లోనూ కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌లో బలంగా ఉంది. ఓపెనర్ రోహిత్ కూడా ఫాంలోకి రావటంతో టాప్ ఆర్డర్ మొత్తం దుమ్మురేపటానికి రెడీ అంటోంది. ధావన్, రైనా, కోహ్లీ, మనీశ్ పాండే, ధోనీ బ్యాంటింగ్ తో మెరుపులు ఖాయం అంటున్నారు. 
 
ఇకపోతే బౌలింగ్‌లోనే తడబాటు కనిపిస్తోంది. గాయంతో రెండో టీ-20కి దురమైన బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఆడటం కష్టమే. పేసర్ జయదేవ్ రాణిస్తే మాత్రం టీమిండియాదే పైచేయి. చాహల్, శార్దూల్ ఠాకూర్ పరుగులు ఇవ్వటంలో పిసినారితనం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికితోడు కేప్ టౌన్ గ్రౌండ్ సెంటిమెంట్‌గా భారత్ అచ్చొచ్చిన పిచ్.
 
సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. అందరూ కొత్త ఆటగాళ్లు. ఇది టీమిండియాకు మైనస్. ఎవరు ఎలా ఆడతారో పూర్తిగా అవగాహన లేదు. దీనికితోడు బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా బలంగా ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

క్రికెట్ బోర్డులో ముసలం.. జట్టు జట్టంతా మూకుమ్మడి రాజీనామాలు

సంచలనాలకు మారుపేరైన కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. ఫలితంగా ఆ దేశ క్రికెట్ ...

news

బౌలర్లకూ ఇక హెల్మెట్ తప్పదా? బలంగా బాదడంతో బంతి అక్కడ తాకి?

న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. బంతి తగలడంతో కొందరు గాయాలైతే.. ...

news

రెండో టీ-20 దక్షిణాఫ్రికా గెలుపు.. ధోనీ, పాండే మెరిసినా నో యూజ్

ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్‌ (69) చెలరేగడంతో ...

news

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ట్వంటీ20 సిరీస్ : నేడు రెండో మ్యాచ్

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం సెంచూరియన్‌ ...

Widgets Magazine