కారు ప్రమాదం.. ఏడాది బిడ్డతో దక్షిణాప్రికా మహిళా క్రికెటర్ మృతి..

Last Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (12:27 IST)
దక్షిణాప్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎలీసా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఏడాది బిడ్డ కూడా కారు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన క్రికెటర్లలో విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, 25 ఏళ్ల క్రికెటర్ ఎలీసా.. దక్షిణాఫ్రికా తరపున మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇంకా గత 2013వ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ పోటీలోనూ ఈమె పాల్గొంది. 
 
ఆపై క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎలీసా.. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో ఎలీసా.. ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో కారులో ప్రయాణించిన నలుగురు కూడా మరణించారు. ఈ మృతుల్లో ఏడాది పాప కూడా వుంది. ఈ వార్త దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది.దీనిపై మరింత చదవండి :