మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (18:56 IST)

భారత్‌ను చిత్తు చేసిన సఫారీలు - టెస్ట్ సిరీస్ కైవసం

సొంత గడ్డపై సఫారీలు తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. పర్యాటక భారత క్రికెట్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌‍లో సౌతాఫ్రికా జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 212 పరుగులు విజయలక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సౌతాఫ్రికా యువ ఆటగాడు కీగాన్ పీటర్సన్ అద్భుతంగా రాణించి 82 పరుగులతో అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
ముఖ్యంగా స్లిప్‌లో పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను పుజారా జారవిరచడంతో దానికి భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. నిజానికి ఈ సిరీస్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించిన తీరు చూస్తే సఫారీ జట్టును ఖచ్చితంగా చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, ఆ తర్వాత జరిగిన రెండు, మూడు టెస్టుల్లో భారత్ పేలవమైన ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పగులు చేసింది. అలాగే, సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 210, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.