శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:40 IST)

తీహార్ జైల్లో శ్రీశాంత్‌పై హత్యాయత్నం! పదునైన కత్తితో రౌడీ దాడి..!

2013లో తీహార్ జైల్లో 26 రోజులు గడిపిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై హత్యాయత్నం జరిగిందట. ఈ విషయాన్ని శ్రీశాంత్ బావ బాలకృష్ణ తెలిపారు. జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చినప్పుడు శ్రీశాంత్ రోజులు గడిపిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడని ఆయన తెలిపారు.  జైలు ప్రాంగణంలో తాను నడిచి వెళ్తుండగా.. ఓ రౌడీ ఉన్నట్టుండి తన ముందుకు దూకాడని, పదునైన కత్తితో తనమీద దాడి చేశాడని చెప్పాడన్నారు. 
 
ఆ దాడిలో తనకు చేతిమీద గాయమైందని, తర్వాత ఆ రౌడీని జైలు సిబ్బంది తీసుకెళ్లారని బాలకృష్ణన్ అన్నారు. అయితే దీన్ని వివాదం చేయాలని తాము అనుకోవడం లేదని, అందుకే ఈ విషయాన్ని ఎవరికీ ఇన్నాళ్లు చెప్పలేదని వివరించారు. కాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 సంవత్సరంలో శ్రీశాంత్ ఔటయిన విషయం తెలిసిందే.