గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (23:07 IST)

చెన్నై సూపర్‌కింగ్స్‌ని చెడుగుడు ఆడుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

SRH
కర్టెసి-ట్విట్టర్
చెన్నై సూపర్‌కింగ్స్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చెడుగుడు ఆడుకున్నది. 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాట్సమన్లు ఆది నుంచి సూపర్ కింగ్స్ బౌలర్ల పైన విరుచుకుపడ్డారు. ట్రవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 గట్టి పునాది వేయడంతో విజయం సునాయాసంగా మారింది. మార్కక్రమ్ 50 పరుగులు చేసాడు. షహబాజ్ అహ్మద్ 18 పరుగులు, క్లాసన్ 10, నితీష్ కుమార్ 14 పరుగులు చేసారు. ఎక్సట్రాల రూపంలో 6 పరుగులు వచ్చాయి. దీనితో మరో 11 బంతులు వుండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని సాధించింది.
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర 12, రుతురాజ్ 26, రహానే 35, శివమ్ దూబె 45, జడేజా 31, మిచ్చెల్ 13, ధోనీ 1 పరుగు చేసారు. సన్ రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడంలో సూపర్ కింగ్స్ కష్టపడ్డారు.