బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (21:58 IST)

నెదర్లాండ్స్‌‌పై ఘన విజయం.. మెరిసిన ముగ్గురు.. అరుదైన ఫీట్

Team India
Team India
ట్వంటీ-20 ప్రపంచకప్ టీమిండియా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సూపర్-12లో భాగంగా గ్రూప్-2లో గురువారం టీమిండియా నెదర్లాండ్స్‌పై గెలుపును నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. 
 
కేఎల్‌ రాహుల్‌ మినహా టాపార్డర్‌ అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. 
 
నెదర్లాండ్స్‌పై భారీ రన్‌రేట్‌తో గెలిచి అగ్రస్థానంలో నిలవాలని టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టీమిండియా బ్యాట్స్‌మెన్లు అర్థశతకాలతో మెరిశారు. 
 
కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(39 బంతుల్లో 53 పరుగులు) విరాట్‌ కోహ్లి(44 బంతుల్లో 62 నాటౌట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(25 బంతుల్లో 51 నాటౌట్‌) అర్థ శతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. 
 
టి20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు అర్థసెంచరీలు సాధించడం ఇది రెండోసారి కాగా.. ఓవరాల్‌గా మూడోసారి. ఇంతకుముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఈ ఫీట్‌ సాధించింది.