Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్ తరహా పీఎస్ఎల్‌లో చైనా క్రికెటర్లు.. పాకిస్థాన్‌కు వస్తారట..

సోమవారం, 21 ఆగస్టు 2017 (17:39 IST)

Widgets Magazine
pakistan cricket team

ముంబై పేలుళ్లకు అనంతరం భారత్.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఇష్టపడలేదు. అలాగే 2009 లాహోర్‌‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్ర దాడి ఘటనకు తర్వాత ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టాలు తప్పలేదు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు మినహా భారత్‌లో ఇంతవరకు క్రికెట్ ఆడని పాకిస్థాన్‌కు చైనా ఊరటనిచ్చింది. 
 
చైనాతో పాకిస్థాన్‌కు ఉన్న సత్సంబంధాలను వినియోగించుకుని.. పాకిస్థాన్‌కు చైనా క్రికెటర్లు వచ్చి ఆడేందుకు సై అన్నారు. ఇప్పటికే ఇద్దరు చైనా క్రికెటర్లు వచ్చే ఏడాది జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో (పీఎస్ఎల్) పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో చైనాలోనూ క్రికెట్ ఆదరణ లభిస్తుందని భావిస్తోంది. తద్వారా పాకిస్థాన్-చైనాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపరిచినట్లు అవుతుందని క్రీడా పండితులు అంటున్నారు.  
 
ఇందులో భాగంగా, చైనా నేషనల్ క్రికెట్ టీమ్‌కి చెందిన ఇద్దరు ఆటగాళ్లు.. వచ్చే పీఎస్ఎల్‌లో పెషావర్ జాల్మి తరపున ఆడనున్నట్టు పాక్ అధికారిక పత్రిక ఏపీపీ వెల్లడించింది. చైనాలో క్రికెట్ వున్నా.. గుర్తించదగిన స్థాయిలో క్రికెటర్లు ప్రదర్శన చేయలేకపోతున్నారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చైనాకు గుర్తింపు లభించట్లేదు.

అందుకే పాకిస్థాన్ స్వదేశీ టోర్నీలో చైనా క్రికెటర్లను బరిలోకి దించాలని చైనా భావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీలంక జట్టు ఈ ఏడాది సెప్టెంబరులో పాకిస్థాన్‌లో పర్యటించనుంది. తద్వారా 8 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ ఆడనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

దంబుల్లా వన్డే : శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను ...

news

బాపట్ల యువ క్రికెటర్ వీరబాదుడు.. 29 బంతుల్లో 100 రన్స్...

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి ...

news

వీర కుమ్ముడు... 73 బంతుల్లో 161 ర‌న్స్... ఎవరు? (Video)

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడ‌మ్ లిత్‌ దుమ్మురేపాడు. నాట్‌వెస్ట్ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్‌లో ...

news

ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. టాప్-10లో లేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు

తాజాగా ఐసీసీ విడుదల చేసిన పరిమిత ఓవర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి, స్టార్ ...

Widgets Magazine