శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (16:27 IST)

స్వచ్ఛ భారత్ ప్రచారకర్త ఆఫర్ : నో చెప్పాలనుకుంటున్నకెప్టెన్ ధోనీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి జార్ఖండ్‌కు గానూ ప్రచారకర్తగా వ్యవహరించాలని టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించాలనే యోచనలో ధోనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగిన కారణం లేకపోలేదు.  ఇప్పటికే రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, అక్షరాస్యత, పల్స్ పోలియా వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
 
వాటిని సక్రమైన విధంలో ప్రజల్లోకి తీసుకెళ్లంలో ప్రభుత్వం విఫలమవుతోందని, ఆయా పథకాలకు లభిస్తున్న ఆదరణ అంతంతమాత్రమేనని ధోనీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ధోనీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ రాంచీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం ద్వారా ధోనీ మోడీ ఆఫర్‌ను తిరస్కరించుకోవచ్చునని క్రీడా పండితలు అంటున్నారు.