కాంబ్లీ భార్యను తాకరాని చోట తాకాడు.. బ్యాగ్‌తో బాదేసింది.. ఎవరు?

సోమవారం, 2 జులై 2018 (12:44 IST)

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన తనపట్ల బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. తాకరాని చోట పదే పదే తాకాడని ఆండ్రియా ఆరోపించారు. అంతటితో ఆగకుండా రాజేంద్ర తివారీపై ఆండ్రియా దాడి చేసింది. ఈ ఘటన ముంబైలోని ఇనార్బిట్ మాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. షాపింగ్ కోసం ముంబైలోని ఇనార్బిట్ మాల్‌కు కాంబ్లీతో పాటు ఆయన సతీమణి ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రాజేంద్ర తివారీ ఆమె పట్ల అభ్యంతరకరంగా తాకాడని తెలిసింది. ఒకసారి తనను తగిలితే ఊరుకున్నానని, పదేపదే తాకరాని చోట రాజేంద్ర తివారీ తాకుతుండటాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆండ్రియా ఆరోపించింది. 
 
అంతేగాకుండా కాంబ్లీతో పాటు ఆమె తివారీతో వాగ్వివాదానికి దిగింది. ఈ వాగ్వివాదం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఆండ్రియా తన చేతిలోని బ్యాగ్‌తో రాజేంద్రను బలంగా బాదింది. ఆ సమయంలో రాజేంద్రతో పాటు అంకిత్, అతని సోదరుడు అంకుర్ కూడా అక్కడే ఉన్నారు. 
 
ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పోలీసులకు కాంబ్లీ, ఆండ్రియా ఫిర్యాదు చేశారు. రాజేంద్ర తివారీ కూడా కాంబ్లీ దంపతులు తమపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :  
వినోద్ కాంబ్లీ ఆండ్రియా ముంబై మాల్ రాజేంద్ర తివారీ షాపింగ్ Wife Singer Father Mumbai Mall Ankur Tiwari Ankit Tiwari Vinod Kambli Raj Kumar Tiwari

Loading comments ...

క్రికెట్

news

మాజీ క్రికెటర్ భార్యపై కేసు.. ఎందుకో తెలుసా?

మాజీ క్రికెటర్ వినోంద్ కాంబ్లీ సతీమణిపై పోలీసు కేసు నమోదైంది. బాలీవుడ్ సింగర్ అంకిత్ ...

news

రాజ్యసభకు హర్యానా హరికేన్‌.. రాష్ట్రపతి కోటాలో...

భారత క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్‌‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ ...

news

క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ ...

news

మళ్లీ డోపింగ్‌లో దొరికిపోయిన అహ్మద్ షెహజాద్..

మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్ వివాదం సంచలనం సృష్టించింది. ఇక ...