అనుష్క శర్మను చూసి భోజనం చేశావా..? అని అడిగిన కోహ్లీ..

Kohli-Anushka
Kohli-Anushka
సెల్వి| Last Updated: గురువారం, 29 అక్టోబరు 2020 (13:15 IST)
తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాలీవుడ్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. త్వరలోనే విరాట్ కోహ్లీ, అనుష్క జంట ముగ్గురు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్క శర్మ గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు కోహ్లి.

ఈ నేపథ్యంలో గర్భవతి అయిన అనుష్క శర్మను చూస్తూ.. విరాట్ కోహ్లి చేసిన సైగలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్యూట్ జంట అంటూ నెటిజన్లు వారిరువురిపై ఉన్న అభిమానాన్ని చూపెడుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న.. తీరిక లేని క్రికెట్ ఆడినా కుటుంబానికి విలువిచ్చే క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా... ప్రస్తుతం ఐపీఎల్ కోసం కోహ్లి దుబాయ్ వెళ్లగా.. ఈ మధ్యే అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడ విరాట్‌తో పాటు ఆయన టీమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. అయితే బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉండగా.. స్టాండ్స్ లో అనుష్క శర్మ బయటకువచ్చింది. ఆమెను చూసిన కోహ్లి.. భోజనం చేశావా..? అని అడిగాడు.

సైగ రూపంలో కోహ్లి అనుష్క శర్మను అడగడంతో.. ఆమె కూడా స్పందించింది. నువ్వు కూడా వచ్చినాక కలిసి తిన్నామన్నట్టుగా ఆమె స్పందించింది. ఈ వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.దీనిపై మరింత చదవండి :