1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (07:32 IST)

పరుగులన్నీ నేనే చేస్తే మిగతావాళ్లేం చేస్తారటా: ప్రెస్ మీట్ ‌లో రెచ్చిపోయిన కోహ్లీ

రాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు పయనం నల్లేరు మీద నడకలా సాగుతోంది. ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టుమ్యాచులు, వన్డే మ్యాచ్‌లు, టి20 మ్యాచ్‌లు ఏవీ వదలకుండా సీరీస్ విజయాలు సాధించిన కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు గాల్లో తేలిపోతున్నట్లే లెక్క. సీరీస్‌లో ఓటమినెరుగని కెప్

విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు పయనం నల్లేరు మీద నడకలా సాగుతోంది. ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టుమ్యాచులు, వన్డే మ్యాచ్‌లు, టి20 మ్యాచ్‌లు ఏవీ వదలకుండా సీరీస్ విజయాలు సాధించిన కెప్టెన్ కోహ్లీ ఇప్పుడు గాల్లో తేలిపోతున్నట్లే లెక్క. సీరీస్‌లో ఓటమినెరుగని కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా టి20 సీరీస్ కోహ్లీకి సంతోషం తెచ్చిపెట్టేది కాదు. ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లలో 29, 21, 2 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ సగటు దారుణంగా పడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌లలో 17.33 శాతం సగటు సాధించడం గమనార్హం. ఇంత తక్కువ సగటుతో టీ20  సీరీస్‌ని ముగించడం కోహ్లీకి ఇదే తొలిసారి. 
 
సీరీస్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్సులో తన పేలవమైన ప్రదర్శన గురించి ప్రశ్నించిన జర్నలిస్టుకు కోహ్లీ పెడసరంగా జవాబిచ్చాడు. 2016 ఐపీఎల్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నేను నాలుగు సెంచరీలు చేశాను. ఆ సమయంలో ఎవరూ నన్నడగలేదు. ఓపెనర్‌గా వచ్చి నేను సాధించిన ఘనతను ప్రజలు పదే పదే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు గత మూడు మ్యాచ్‌లలో నేను పెద్దగా స్కోర్ చేయనంతమాత్రాన చిక్కులు మొదలవుతున్నాయి అని కోహ్లీ దురుసుగా సమాధానమిచ్చాడు. 
 
దయచేసి జట్టులోని 10 మంది ఇతర ఆటగాళ్లపైనా కాస్త దృష్టి పెట్టండి. ప్రతిదీ నేనే చేసినట్లైతే, ఇతరులు ఏం చేయాలి మరి. ప్రస్తుతానికి నాకైతే ఇది గొప్ప సీరీస్ విన్. దానికే చాలా సంతోషపడుతున్నాను. ఓపెనింగ్ స్లాట్ గురించి నేనేమీ వర్రీ కావడం లేదు అని కోహ్లీ వివరించాడు.
 
గత రెండు మ్యాచ్‌లలో నేను 70 పరుగులు చేసి ఉంటే నన్ను ఈ ప్రశ్న అడిగేవారా. టీమ్ సాధించినదానికి సంతోషించండి అని కోహ్లీ సూచించాడు.
 
అన్ని పరుగులూ నేనే చేస్తే మిగతావాళ్లేం చేయాలటా అంటూ కోహ్లీ చేసిన వ్యక్తీకరణలో కాస్త పెడసరం దాగివుంది. ఈ చిరాకు, ఆగ్రహం, లయ తప్పడం కెప్టెన్‌గా తనకు మంచింది కాదని కోహ్లీ గ్రహిస్తే చాలా మంచిది.