బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (16:19 IST)

లోకల్ ప్లేయర్ ఇంట్లో బిర్యానీని లాగించిన విరాట్ కోహ్లీ

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. అలాంటి బిర్యానీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి బిర్యానీని విరాట్ కోహ్లీ కూడా రుచిచూశాడు.

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. అలాంటి బిర్యానీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి బిర్యానీని విరాట్ కోహ్లీ కూడా రుచిచూశాడు.
 
ఐపీఎల్‌ 11వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం నగరానికి వచ్చిన కోహ్లీ అండ్ టీమ్.. స్థానిక ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఇంటికి వెళ్లి బిర్యానీ కడుపునిండా లాగించారు. సిరాజ్ ఇప్పుడు బెంగళూరు టీమ్‌లో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో టీమ్ ఇక్కడికి రాగానే తన ఇంటికి తీసుకెళ్లాడు. సిరాజ్ ఇంట్లో కోహ్లితోపాటు ఇతర ప్లేయర్సంతా బిర్యానీ టేస్ట్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
ఆదివారం రాత్రి పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను చూస్తూ కోహ్లి టీమ్ డిన్నర్ చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూరు టీమ్‌కు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఇందులో గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే.