గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:28 IST)

ఓటు హక్కులేని విరాట్ కోహ్లీ.. ఎందుకంటే?

భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగితే ఆయన్ను ఆపటం ఎవరితరం కాదు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే ప్రత్యర్థి బౌలర్లు బేలమొహాలువేసి చూడాల్సిందే. ఇక కెప్టెన్‌గా ఆయన రచించే వ్యూహాల్లో ప్రత్యర్థులు చిక్కుకోవాల్సిందే. 
 
విరాట్ కోహ్లీ పేరును తలచుకుంటేనే ప్రత్యర్థి ఆటగాళ్ళ వెన్నులో వణుకుపుడుతుంది. కానీ, రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. కదా..! అందుకే విరాట్ కోహ్లీ చేసిన చిన్న తప్పు.. ఈ సారి అతడిని ఓటింగ్‌కు దూరం చేసింది. దీంతో ఓటు వేయకుండా కోహ్లీ ఔట్ అయ్యాడన్నమాట. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తన భార్య అనుష్క శర్మతో పాటుగా ముంబైలోని ఓర్లీ ప్రాంతం నుంచి ఓటేయాలని విరాట్ కోహ్లీ భావించాడు. దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్‌కు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా..! అక్కడే అసలు చిక్కు ఉంది. 
 
అప్పటికే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు ముగిసింది. మార్చి 30 నాటికి చేరాల్సిన అప్లికేషన్ గడువు పూర్తయ్యాక చేరడంతో మేం చేసేదేమీ లేదంటూ ఎన్నికల సంఘం అధికారులు చేతులెత్తేశారు. 
 
ఈ విషయంపై స్పందించిన ఎన్నికల కమిషన్ అధికారి... కోహ్లీ అప్లికేషన్‌ను పక్కన ఉంచాం. ఎలాగైనా అదే స్థానం నుంచి ఓటు వేసేలా ఏర్పాటు చేయడాలని తన టీం చాలా సార్లు ప్రయత్నించింది. అప్పటికే గడువు పూర్తయిపోవడంతో ఏం చేయలేకపోయాం అని వివరణ ఇచ్చారు.