శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (11:49 IST)

వాషింగ్టన్ సుందర్ లెజండ్ అవుతాడు.. తండ్రి

washington Sundar
వాషింగ్టన్ సుందర్.. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో టీమిండియా బ్రిస్బేన్ టెస్ట్‌లో చారిత్రక విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 62 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లు తీసుకున్నాడు. 
 
ఇక చేజింగ్‌లోనూ 22 పరుగులు చేశాడు. తన కొడుకు ప్రదర్శన చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నారు అతని తండ్రి ఎం. సుందర్‌. ఆస్ట్రేలియాలో అతని ప్రదర్శన చాలా ప్రత్యేకమైనదని, అతడు ఓ లెజెండ్ అవుతాడని ఆయన అంటున్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ మాట్లాడారు.
 
వాషింగ్టన్‌, అశ్విన్‌, నటరాజన్‌, టీమిండియాను చూసి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. వాషింగ్టన్ సహజంగానే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌. అతను తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు అని సుందర్ అన్నారు.
 
వాషింగ్టన్‌లో నైపుణ్యం, కఠినంగా శ్రమించే తత్వం, అంకితభావం, క్రమశిక్షణ ఉన్నాయని, ఇండియన్ టీమ్‌లో దేవుడు అతనికి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఇస్తాడని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిజానికి చివరి టెస్ట్‌లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు అనుకోకుండా చోటు దక్కింది. రెగ్యులర్ స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా ఇద్దరూ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుందర్‌ను తీసుకున్నారు.