శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2016 (15:02 IST)

పాక్ క్రికెటర్లకు కోహ్లీ మెలకువల్ని నేర్పాలన్న అక్తర్.. కోహ్లీ ఏమన్నాడు?

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పాక్ బ్యాట్స్‌మెన్స్‌కు మెలకువలు నేర్పాల్సిందిగా పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కోరాడు. వరల్డ్ కప్ సందర్భంగా షోయబ్ ఓ స్పోర్ట్ టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీ ఆటతీరు సూపర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై  వ్యాఖ్యలపై కోహ్లీ స్పందించాడు. ప్రపంచంలో ఉండే అన్ని విషయాలను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని... ఒక్క క్రికెట్ గురించి తప్ప అని కోహ్లీ బదులిచ్చాడు. కోహ్లీ సమాధానంపై షోయబ్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
 
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్‌ జట్టుకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. బౌలర్లు రాణిస్తున్నప్పటికీ బ్యాట్స్‌మెన్స్ మాత్రం విఫలమవుతున్నారు. బ్యాట్స్‌మెన్ల వైఫల్యం కారణంగా వరల్డ్ టీ-20 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరుతో అందరి మన్ననలు పొందాడు విరాట్ కోహ్లీ. అలాంటి కోహ్లీ పాక్ బ్యాట్స్ మెన్లకు మెలకువలు నేర్పాలని అక్తర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
మరోవైపు టీ20 వరల్డ్‌క్‌పలో భారత చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమికి తాను చేసిన తప్పిదమే కారణమని బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మదుల్లా అన్నాడు. ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో తాను చేసిన తప్పు వల్లే భారత చేతిలో ఓటమి ఎదురైందని మహ్మదుల్లా చెప్పాడు.