Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌తో నాలుగో వన్డే.. గెలుపొందిన ఆస్ట్రేలియా.. కోహ్లీసేనకు షాక్..

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (10:40 IST)

Widgets Magazine
australian cricketers

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్ జట్టు విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై గెలిచి బోణీ కొట్టింది. దీంతో, ఐదు వన్డేల సిరీస్ లో 3-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది. అయితే వరుసగా పదో వన్డేలో నెగ్గి రికార్డు సృష్టించాలనుకున్న కోహ్లీసేన కల నెరవేరలేదు. 
 
దుర్గాష్టమి రోజు టీమిండియా విజయ ‘దశమి’ని చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్‌-రహానె మళ్లీ శతక భాగస్వామ్యంతో గట్టి పునాది వేసినా.. కేదార్‌, హార్దిక్‌ మెరుపులతో విజయానికి చేరువైనా.. చివర్లో తడబడిన భారత్ విజయం సాధించలేకపోయింది.
 
వందో వన్డేలో డేవిడ్‌ వార్నర్‌ శతకం సాధించడంతో పాటు ఆరోన్‌ ఫించ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆసీస్‌.. చివర్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో గెలుపును నమోదు చేసుకుంది. సిరీస్‌ కోల్పోయినా.. ఓదార్పు విజయాన్ని ఆస్ట్రేలియా ఖాతాలో వేసుకుంది.
 
ఆస్ట్రేలియా స్కోర్: 334/5 (50 ఓవర్లలో)
భారత్ స్కోర్: 313/8 (50 ఓవర్లలో)
 
టీమిండియా బ్యాటింగ్ : రహానె (53), రోహిత్ శర్మ (65), విరాట్ కోహ్లీ (21), పాండ్యా (41), జాదవ్ (67), ఎంకే పాండే (33), ధోనీ (13), పటేల్ (5), మహ్మద్ షమీ 6 పరుగులతో, ఉమేష్ యాదవ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ - 1, కౌల్టర్ - నీల్ - 2, రిచర్డ్ సన్ - 3, జాంపా - 1 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చారు. 
 
గత మ్యాచ్‌లో శతక్కొట్టిన ఫించ్‌ ఫామ్‌ను కొనసాగించగా.. వందో వన్డేలో వార్నర్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్‌ ఆడాడు. ఈ ఇద్దరూ 35 ఓవర్లలో తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడంతో ఆసీస్‌ సులభంగా 400 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, భారత బౌలర్లు చివర్లో మరోసారి గొప్పగా పుంజుకున్నారు. చివరి 15 ఓవర్లలో 103 పరుగులే ఇచ్చి ఆసీస్‌ను కట్టడి చేశారు.
 
అయితే, ఆరంభంలో మాత్రం ఫించ్ (94)‌, వార్నర్‌ (124) ఆతిథ్య బౌలర్లకు సింహస్వప్నమయ్యారు. హ్యాండ్స్‌కోంబ్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 43), స్టొయినిస్‌ (9 బంతుల్లో 15 నాటౌట్‌) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

చిక్కుల్లో బెన్ స్టోక్స్... ఒక నిమిషంలో 15 పిడిగుద్దులు (వీడియో)

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చిక్కుల్లో పడ్డాడు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో ...

news

స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. రెడ్ కార్డ్ అమలు.. భలే నిర్ణయమన్న సౌరవ్ గంగూలీ

క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడితే ...

news

ఆటగాళ్లూ జాగ్రత్త!.. దురుసుగా ప్రవర్తిస్తే రెడ్‌కార్డే...

అంతర్జాతీయ క్రికెట్ నియమనిబంధనలను ఐసీసీ మరోసారి సవరించింది. పాతవాటిలో కొన్ని మార్పులు ...

news

ఆస్ట్రేలియా కుర్రోళ్ళు చెత్తగా ఆడుతున్నారు... : హర్భజన్ సింగ్

భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని సభ్యుల ఆటతీరుపై భారత టర్బోనేటర్ ...

Widgets Magazine