Widgets Magazine

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:54 IST)

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హిజ్రాగా మారిపోయాడు. అచ్చం హిజ్రాల్లాగానే చీరకొట్టి.. బొట్టుపెట్టి... తానుకూడా హిజ్రాలకు ఏం తీసిపోనని నిరూపించాడు. అసలు గౌతం గంభీర్ ఏంటి.. హిజ్రా మారిపోవడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
gautam gambhir
 
సామాజిక సేవలోనే కాదు... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో గౌతం గంభీర్ ఎపుడూ ముందువరుసలో ఉంటాడు. అంతేకాక.. సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఘటనల గురించి సోషల్‌మీడియా వేదికగా అతను గళమెత్తుతూ ఉంటాడు. 
 
అయితే సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ యేడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. 
 
తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు.
 
ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ.. సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నానంటే... ధోనీ క్లారిఫై

భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీని తాను ఎందుకు వదులుకున్నానో మాజీ కెప్టెన్ మహేంద్ర ...

news

రవిశాస్త్రి ఓ అజ్ఞాని... సౌరవ్ గంగూలీ ఫైర్

భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రిపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ...

news

ఇంగ్లండ్‌లో టెస్ట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా

దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల రూపంలో తీసుకుని విదేశాలకు పారిపోయిన ...

news

ఇప్పుడిప్పుడే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది... సచిన్ భావోద్వేగపు ట్వీట్

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నడూ ...

Widgets Magazine