1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:51 IST)

సాగర్ మిశ్రా అదుర్స్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టైమ్స్ షీల్డ్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు

క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదవుతూనే వున్నాయి. స్టార్ ప్లేయర్ల రికార్డులు ఓవైపుంటే.. కుర్రకారు ప్రత్యేక రికార్డులతో తమ సత్తాచాటుకుంటూ దూసుకెళ్తున్నారు. అనామక ఆటగాళ్లు సైతం సూపర్ రికార్డులను సాధించి.

క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదవుతూనే వున్నాయి. స్టార్ ప్లేయర్ల రికార్డులు ఓవైపుంటే.. కుర్రకారు ప్రత్యేక రికార్డులతో తమ సత్తాచాటుకుంటూ దూసుకెళ్తున్నారు. అనామక ఆటగాళ్లు సైతం సూపర్ రికార్డులను సాధించి.. ఒక్కసారిగా స్టార్ అయిపోతున్నారు. తాజాగా టైమ్స్‌ షీల్డ్‌ బి డివిజన్‌ మ్యాచ్‌లో సాగర్‌ మిశ్రా అనే 23 ఏళ్ల ఆటగాడు ఈ అరుదైన రికార్డునే నమోదు చేసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. 
 
ఆర్‌సీఎఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆటకు రెండో రోజైన బుధవారం పశ్చిమ రైల్వేస్‌ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాగర్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ తుషార్‌ కుమార్‌ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది టోర్నమెంట్‌ రికార్డు నెలకొల్పాడు. దీంతో 46 బంతుల్లోనే 91 పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా సాగర్ ఎదుర్కొన్న చివరి 11 బంతుల్లో తొమ్మిదింటిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ రికార్డు నెలకొల్పడం పట్ల సాగర్ హర్షం వ్యక్తం చేశారు.