Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాండ్యా ప్రమోషన్‌కు రవిశాస్త్రి కిటుకేనట.. : విరాట్ కోహ్లీ

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:38 IST)

Widgets Magazine
virat kohli

భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్‌ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ పండితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయలక్ష్యాన్ని (294 రన్స్) మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే ఛేదించింది. దీనికి కారణం హార్దిక్ పాండ్యా ఇన్నింగ్సే కారణం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టుకు అతను కీలక ఆటగాడని పొగడ్తలు గుప్పించాడు.
 
బ్యాటింగ్ ఆర్డర్‌లో పాండ్యాకు ప్రమోషన్ కల్పించాలనే ఆలోచన తొలుత కోచ్ రవిశాస్త్రికి వచ్చింది. దీనిపై డ్రస్సింగ్ రూములో చర్చించాం. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న వేళ, అటాకింగ్ చేయగల ఆటగాడు కావాలని అనిపించింది. అతను విజయం సాధించాడు. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు పాండ్యా అని కోహ్లీ కితాబిచ్చాడు. 
 
భారత క్రికెట్ జట్టులో అతనివంటి ఆల్‌రౌండర్ ఉండటంతో సమతూకం పెరిగిందన్నాడు. రోహిత్, రహానేలు కూడా పాండ్యా వంటి కీలక ఆటగాళ్లేనని, బ్యాటు చేతిలో ఉంటే రెచ్చిపోయి ఆడుతుండే పాండ్యా నుంచి మరిన్ని కీలక ఇన్నింగ్స్ రావాలని అభిలషించాడు. గత ఐదారేళ్లుగా మంచి ఆల్‌రౌండర్ కోసం టీమిండియా వేచి చూస్తోందని, పాండ్యా రాకతో ఆ కోరిక తీరినట్లయిందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఇష్టపడతానని నిన్నటి మ్యాచ్ అనంతరం పాండ్యా మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరగనుంది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు.. ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు..

వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ వన్డేలో ఆసీస్ చిత్తు...

సొంతగడ్డపై టీమిండియా సింహంలా గర్జించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో ...

news

ఇండోర్ వన్డే: ఫించ్ సెంచరీ... భారత్ టార్గెట్ 294 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ...

news

తప్పతాగి పోర్న్ స్టార్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ క్రికెటర్!

ఆయనో క్రికెట్ లెజెండ్. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ...

Widgets Magazine