Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వావ్... మిథాలీ రాజ్‌కు బీఎండబ్ల్యూ ఇచ్చేందుకు ముందుకొచ్చేసిన 'హీరో'

మంగళవారం, 25 జులై 2017 (13:35 IST)

Widgets Magazine

మహిళా ప్రపంచకప్ పోటీల్లో కప్ ను జస్ట్ మిస్ చేసుకున్న మిథాలీ రాజ్ సేనపైన మన దేశంలో పొగడ్తల జల్లు కురుస్తూనే వున్నాయి. ఆట ముగిసి మూడు రోజులు కావస్తున్నా ఇంకా ట్విట్టర్లో #అంటూ టాప్ ప్లేసులో ట్రెండింగ్ నడుస్తూ వున్నదంటే పొగడ్తల జల్లు ఏ స్థాయిలో వున్నవో అర్థం చేసుకోవచ్చు. ఇదిలావుంటే జట్టును ముందుకు తీసుకెళ్లి అందరి ప్రశంసలు అందుకుంటున్న కెప్టెన్ మిథాలీ రాజ్‌కు అరుదైన బహుమతిని ఇచ్చేందుకు సిద్ధమైపోయారు ఓ వ్యక్తి. 
BMW-Mythali Raj
 
ఆ వ్యక్తి మరెవరో కాదు చాముండీశ్వరీనాథ్. క్రీడాకారులతో అత్యంత సన్నిహితంగా వుండే చాముండేశ్వరీనాథ్ హైదరాబాదు బిగ్ షాట్లలో ఒకరుగా చెప్తారు. ఆయన ఇప్పుడు జట్టును ప్రపంచకప్ ఫైనల్ చేర్చిన మిథాలీకి రూ.40 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయబోతున్నారు. విషయం ఏమిటంటే... ఆయన క్రీడాకారులకు స్ఫూర్తి నింపేందుకు ఇలా చేస్తుంటారు కానీ కొందరు ఆయన్ని పబ్లిసిటీ హీరో అంటూ సెటైర్లు వేస్తుంటారు.
 
ఏదేమైనప్పటికీ ఆయన మాత్రం క్రీడల్లో మంచి ప్రావీణ్యం చూపేవారికి బహుమతులు ఇస్తూ వుంటారు. రియో ఒలింపిక్ క్రీడల్లో పతకాలు గెలిచిన పి.వి.సింధు, సాక్షి మాలిక్, దీపా మాలిక్‌లకు కూడా బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారీయన. ఇప్పుడు హైదరాబాదీ మిథాలీ రాజ్ కు ఇలా బీఎండబ్ల్యూ ఇవ్వడం స్ఫూర్తిదాయకమే కదా. పబ్లిసిటీ అని కొందరు పేర్లు పెడుతున్నా చాముండేశ్వరినాథ్ చేస్తున్నదానికి క్రీడాకారులకు మాత్రం స్ఫూర్తిదాయకమే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేయండి. అద్బుతాలు జరుగుతాయన్న మిథాలి

మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయమని టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ ...

news

ఒత్తిడికి భయపడ్డాం... అందుకే కప్ చేజారింది : మిథాలీ రాజ్

మహిళల ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్ పోటీలో భారత్ మహిళ క్రికెట్ జట్టు తృటిలో కప్‌ను ...

news

#WWC17Final : భారత మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగం!

మహిళల ప్రపంచ కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి... తృటిలో కప్‌ను కోల్పోయిన ...

news

ప్రత్యర్థికి టోర్నీలో ఎన్నడూ తలవంచలేదు..జట్టును చూసి గర్విస్తున్నా: కంట తడి పెట్టుకున్న మిథాలి రాజ్

గత 18 ఏళ్లుగా అలుపెరుగకుండా భారత జట్టుకు బ్యాట్స్ విమెన్‌గా, కెప్టెన్‌గా సేవలందించిన ...

Widgets Magazine