శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (08:36 IST)

ఓ ఇంటివాడైన భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్

భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. 
 
ఢిల్లీ, గురుగ్రామ్‌లోని కర్మా లేక్ రిసార్ట్ ఈ వివాహానికి వేదికగా నిలిచింది. చాహల్, ధనశ్రీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. యూట్యూబ్‌లో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలు చూసిన ఈ బక్కపలుచని క్రికెటర్ ప్రేమలో పడిపోయాడు.
 
తమది స్టూడెంట్ - టీచర్ అనుబంధంలా మొదలైందని అప్పట్లో ధనశ్రీ మీడియాకు తెలిపింది. కొద్దికాలంలోనే తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు తెలుసుకున్నామన్నారు. 
 
ఇందులోభాగంగా గత ఆగస్టులోనే వీరికి రోకా వేడుకను నిర్వహించారు. ఆ సమయంలో తన ప్రపోజల్ గురించి చహల్ సోషల్ మీడియాలో వెల్లడించగా, తాను కూడా సమ్మతించానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. మొత్తంమీద భారత క్రికెట్ జట్టుకు చెందిన మరో క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.