1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (11:54 IST)

బ్యాలెన్స్ - రూట్‌ల సెంచరీల మోత.. ఇంగ్లండ్ 569/7 డిక్లేర్!

సొంతగడ్డ సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 569 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు బ్యాలెన్స్, బెల్‌లు సెంచరీల మోత మోగించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. 
 
అలాగే, తొలి టెస్ట్ ఆడుతున్న జోస్ బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 25 పరుగులు సాధించింది. పేలవ ఫామ్‌తో విమర్శల పాలవుతున్న శిఖర్ ధావన్ తక్కువ స్కోరుకే అవుటై మరోసారి నిరాశపరిచాడు. 
 
టాప్ ఆర్డర్ మూడో రోజు అద్భుతంగా ఆడితేనే... మూడో టెస్టులో ఇండియన్ టీం నిలబడగలదు. రెండో ఇన్నింగ్స్‍‌లో ఇంగ్లండ్ అతి పేలవంగా ఆడితే తప్ప, ఇండియా ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యమని లిటిల్ మాష్టర్ సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.