1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:18 IST)

తొలి మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఓటమి!

ఐసీసీ మహిళల చాంపి‌యన్‌షిప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్ జరిగిన మ్యాచ్‌లో భారత్ 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌ని తొలుత 47 ఓవర్లకు కుదించారు. 
 
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిరిగి ఆటకు బ్రేక్ పడగా, డక్‌వర్త్ లూయస్ విధానంలో ఇంగ్లండ్‌ను గెలిచి నట్టు ప్రకటించారు. 2017 వరల్డ్ కప్‌లో అర్హత కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
 
భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 47 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 193 పరుగులు సాధించింది. స్మృతి మంధానా 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మిథాలీ రాజ్ 34, వల్లస్వామి వనిత 27, శిఖా పాండే 21 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హీథర్ నైట్ మూడు వికెట్లు పడగొట్టింది. అన్య ష్ర బ్‌సోల్‌కు రెండు వికెట్లు లభించాయ.