1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (15:50 IST)

భారత్‌తో తొలిటెస్టు: సెలక్టర్ల ముందు చూపు అదుర్స్!

భారత్‌తో తొలి టెస్టు డిసెంబర్ 4వ తేదీ నుంచి 8వరకు జరుగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా సెలక్టర్లు ముందు చూపుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ కోసం ముందుగానే జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు... ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 5-0తో ఆసీస్ చిత్తుగా ఓడించడంతో అదే ఫార్ములాను ఫాలో చేస్తున్నారు. 
 
ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రసారమైన ఓ క్రికెట్ షోలో మాజీ క్రికెటర్, ఆసీస్ సెలెక్టర్ మార్క్ వా మాట్లాడుతూ, తొలి టెస్టు కోసం రెండు వారాల ముందే జట్టును ఎంపిక చేస్తున్నామని వెల్లడించాడు. శనివారం నాడు సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టును ఎంపిక చేస్తుందని తెలిపాడు. 
 
అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పెర్ఫార్మెన్స్ డైరక్టర్ పాట్ హోవార్డ్ మాట్లాడుతూ, మెరుగైన సన్నాహకాల కోసమే జట్టును ఎంతో ముందుగా ఎంపిక చేస్తున్నారని వెల్లడించారు. దీంతో శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన జోరులో ఉన్న భారత్‌కు ఆస్ట్రేలియా జట్టుతో కష్టాలు తప్పవని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.