శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (10:59 IST)

స్పాట్ ఫిక్సింగ్: శ్రీనివాసన్‌కు సంబంధం లేదు.. కానీ..?

ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
 
శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా చట్ట వ్యతిరేకమైన బెట్టింగుకు పాల్పడ్డట్లు పేర్కొంది. ఐపీఎల్ సీఓఓ రామన్‌కు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు తేల్చింది.
 
అలాగే, విచారణకు అతను ఆటంకం కలిగించలేదని పేర్కొందని అంటూ నివేదికలోని కొన్ని అంశాలను బయటపెట్టింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన బోర్డు కీలక వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)పై నిర్ణయాన్ని తీసుకోవడానికి మంగళవారం పాలక మండలి సమావేశం కానున్న నేపథ్యంలో ఫిక్సింగ్ కేసులో శ్రీని పాత్ర లేదని ముద్గల్ కమిటీలో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు ప్రకటించడం విశేషం.
 
దీనితో మరోసారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఇప్పటి వరకూ శ్రీనివాసన్‌కి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది.