శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (22:14 IST)

వెస్టిండీస్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు : బీసీసీఐ

క్రికెట్ సిరీస్‌ను అర్థాంతరంగా రద్దు చేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో సాగుతున్న పర్యటనలో టీమిండియా, విండీస్ మధ్య మిగతా అన్ని మ్యాచ్‌లనూ నిలిపివేయాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐకి తన నిర్ణయం తెలిపింది. అటు ఆటగాళ్ళు కూడా తమ బోర్డు వైఖరి పట్ల గుర్రుగా ఉన్నారు. సొంత ఖర్చులతో స్వదేశం వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ, "ఆటగాళ్ళతో వివాదాల కారణంగా విండీస్ బోర్డు మిగతా మ్యాచ్‌లను రద్దు చేయాలంటూ బీసీసీఐకి సమాచారం అందించింది. ఆటగాళ్ళలో అంతర్గత సమస్యలే తమ నిర్ణయానికి కారణమని చెప్పింది. దీనిపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేసి, అటుపై, న్యాయపరమైన చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తున్నాం. విండీస్ బోర్డు నిర్ణయం తమను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు.