గురువారం, 14 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఆటగాళ్ల ప్రొఫైల్
Written By PNR
Last Modified: మంగళవారం, 11 జులై 2017 (21:51 IST)

రవిశాస్త్రి.. టీమిండియా కోచ్... ఎంత మొనగాడో తెలుసా?(వీడియో)

రవిశాస్త్రి... ముంబైలో 1962 మే 27వ తేదీన జన్మించారు. ఎత్తు 1.92 మీటర్లు. తల్లిదండ్రులు లక్ష్మీ శాస్త్రి, జయద్రతా శాస్త్రి. 1990లో అలేఖా శాస్త్రిని పెళ్లి చేసుకున్నారు. ఈయన క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం

రవిశాస్త్రి... ముంబైలో 1962 మే 27వ తేదీన జన్మించారు. ఎత్తు 1.92 మీటర్లు. తల్లిదండ్రులు లక్ష్మీ శాస్త్రి, జయద్రతా శాస్త్రి. 1990లో అలేఖా శాస్త్రిని పెళ్లి చేసుకున్నారు. ఈయన క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది. అలాగే, బెస్ట్ కామెంటేటర్‌గా ఐటీఏ అవార్డును అందుకున్నారు. 
 
క్రికెటర్లంతా రవి అని నిక్‌నేమ్‌తో పిలుచుకునే శాస్త్రి... క్రికెట్ ఆల్‌రౌండర్‌గా మంచి పేరుంది. కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. తొలిసారి 1981లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అంరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్ మ్యాచ్‌ను 1992 డిసెంబర్ 26వ తేదీన దక్షిణాఫ్రికాపై ఆడాడు. 
 
1981-92 వరకు భారతజట్టుకు రవిశాస్త్రి ప్రాతినిథ్యం వహించారు. 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్లు ఆయన ఆడారు. టెస్టుల్లో 3,830, వన్డేల్లో 3,108 పరుగులు చేశారు. 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నారు. వన్డేల్లో తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో 1981 నవంబర్ 25వ తేదీన ఆడగా, చివరి వన్డే మ్యాచ్‌ను 1992 డిసెంబర్ 17వ తేదీన సౌతాఫ్రికాపై ఆడాడు. 
 
దేశవాళీ క్రికెట్‌లో 1979 నుంచి 1993 వరకు బాంబే క్రికెట్ జట్టులో ఆడాడు. మొత్తం 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడిన రవిశాస్త్రి... టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 4 సెంచరీలు చేశాడు. టెస్టుల్లో గరిష్టంగా 206 పరుగులు చేయగా, వన్డేల్లో 109 పరుగులు. అలాగే, టెస్టులు, వన్డేల్లో కలుపుకుని మొత్తం 280 వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఐదు వికెట్లను రెండుసార్లు, వన్డేల్లో ఒక్కాసారి చొప్పున తీశాడు. 2014-16 మధ్యకాలంలో టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పనిచేశారు. తాజాగా టీమిండియా కోచ్‌గా ఎంపికైన శాస్త్రి సారథ్యంలో భారత జట్టు 2019 ప్రపంచ కప్ పోటీలకు వెళ్లనుంది. మరి కోహ్లి సేనకు ఆయన ఇచ్చే తర్ఫీదు కప్పును ఎగరేసుకొస్తుందేమో చూద్దాం.