కోహ్లీ టీమ్‌కు బాగా తలంటిన సంజయ్ బంగార్.. మహిళా జట్టు స్పూర్తితో ఆడాలంటూ దెప్పులు
కుంబ్లేని కోచ్ పదవి నుంచి సాగనంపింది మొదలుకుని వివాదాలతో సాగుతున్న టీమిండియా పయనం వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లలో గెలవడం, ఓడటం చందాన కొనసాగుతూ విసుగు తెప్పిస్తున్న క్షణాన ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‍గా ఉన్న సంజయ్ బంగార్ కోహ్లీ టీమ్‌కు బాగానే
కుంబ్లేని కోచ్ పదవి నుంచి సాగనంపింది మొదలుకుని వివాదాలతో సాగుతున్న టీమిండియా పయనం వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లలో గెలవడం, ఓడటం చందాన కొనసాగుతూ విసుగు తెప్పిస్తున్న క్షణాన ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‍గా ఉన్న సంజయ్ బంగార్ కోహ్లీ టీమ్‌కు బాగానే గడ్డి పెట్టాడు. లండన్‌లో ప్రస్తుతం వరుస విజయాలతో జోరును ప్రదర్శిస్తున్న భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంశలు కురిపిస్తూనే వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో ఓటమి పాలైన పురుషుల క్రికెట్ జట్టుకు బంగర్ చురకలంటించాడు.
ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న బంగర్.. వరుసగా మూడు విజయాలు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో ఓటమి పాలైన పురుషుల క్రికెట్ జట్టుకు బంగర్ చురకలంటించాడు. భారత మహిళా క్రికెట్ జట్టు నుంచి స్ఫూర్తి పొందాలంటూ విరాట్ సేనకు సూచించాడు.
ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుపై విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై సంజయ్ బంగర్ ప్రశంసలు కురిపించాడు. 'ఇక్కడ మన భారత మహిళా క్రికెట్ జట్టును తప్పక అభినందించాలి. వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలతో భారత మహిళలు దూసుకుపోతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ పై సాధించిన విజయం నిజంగా అద్భుతం. భారత మహిళలు తొలుత స్వల్ప స్కోరుకే పరిమితమైనా దాన్ని కాపాడుకుని విజయం సాధించారు.
...భారత మహిళలు 169 పరుగులు చేసినా బౌలింగ్ లో చెలరేగిపోయి పాకిస్తాన్ ను కట్టడి చేశారు. ఇక్కడ మన మహిళా క్రికెటర్లే పురుష క్రికెటర్లకు ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. భారత పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో విఫలమైన లోటును మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి భర్తీ చేస్తుందని ఆశిస్తున్నా'అని బంగర్ పేర్కొన్నాడు.