బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 13 జూన్ 2017 (05:05 IST)

కోహ్లీని మించిన అత్యుత్తమ ఆటగాడు అతడేనా... ఎవరు?

ఆధునిక క్రికెట్‌లో రారాజు కోహ్లీ అనుకుంటే అతడిని మించిన ఆటగాడు మరో ఖండం నుంచి పుట్టుకొస్తున్నాడు అంటే వినడానికి భారతీయ అభిమానులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాని ఇది నిజం. ఇటీవలి ప్రపంచం ఎరుగని అత్యద్భుత ఆల్ రౌండర్ మా జట్టులో ఉన్నాడని ఇంగ్లండ్ వన్డే జట్

ఆధునిక క్రికెట్‌లో రారాజు కోహ్లీ అనుకుంటే అతడిని మించిన ఆటగాడు మరో ఖండం నుంచి పుట్టుకొస్తున్నాడు అంటే వినడానికి భారతీయ అభిమానులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాని ఇది నిజం. ఇటీవలి ప్రపంచం ఎరుగని అత్యద్భుత ఆల్ రౌండర్ మా జట్టులో ఉన్నాడని ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంబరపడిపోతున్నాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్‍‌ని  కచ్చితంగా కోరుకుంటుందని మోర్గాన్ కొనియాడాడు. ఈ విషయం ఇండియన్ ప్రీమియర్  లీగ్(ఐపీఎల్) వంటి వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ ప్రస్తావించాడు. 
 
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ' బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో స్టోక్స్ ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. నిన్నటి మ్యాచ్ లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్‌లో కూడా మెరిశాడు. బ్యాటింగ్ లో సెంచరీతో  అదరగొట్టాడు. మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టం.  ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అతని లాంటి ఆటగాడ్ని ఏ జట్టైనా కోరుకుంటుంది' అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.
 
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో బెన్‌ స్టోక్స్‌ (109 బంతుల్లో 102 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 10 సీజన్‌లో బెన్ స్టోక్ ప్రతిభ వల్లే క్వార్టర్ ఫైనల్‌ను దాటగలిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ అతడు స్వదేశానికి చేరుకోగానే చతికిలిపడటం తెలిసిందే.
 
కోహ్లీ నిస్సందేహంగా మేటి బ్యాట్స్‌మన్. కానీ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో మెరుపులు కురిపించే కోహ్లీ ప్రధానంగా బౌలర్ కాని కారణంగా అడపదడపా జట్టు కోసం బౌలింగ్ వేసినా అతడిని ఆల్ రౌండర్‌గా గుర్తించలేం. ఈ మూడురంగాల్లో ప్రావీణ్యం ఉన్న బెన్ స్టోక్ కెరీర్‌లో నిలకడ ప్రదర్శించగలిగితే కోహ్లీని మించిన కీర్తి సాధించవచ్చని  క్రీడా పండితుల అంచనా.