ముంబై వన్డే : సాహసం చేసిన ఆస్ట్రేలియా - భారత్ బ్యాటింగ్
స్వదేశంలో భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య వన్డే సిరీస్ మంగళవారం ప్రారంభమైంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
డే నైట్ గా సాగనున్న ఈ మ్యాచ్ లో రాత్రి పూట మంచు కురిసే అవకాశముంది. రాత్రి బ్యాటింగ్ చేసే జట్టుకు కొంచెం కష్టమే అయినప్పటికీ.. అసీస్ బౌలింగ్ ఎంచుకొని సాహసం చేసిందనే చెప్పాలి. కాగా, రెండోసారి బ్యాటింగ్ సులువుగా ఉంటుందని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ అనడం గమనార్హం.
కాగా, ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బతగిలింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మను బౌలర్ స్ట్రాక్ ఔట్ చేశాడు. 15 బంతులు ఆడిన రోహిత్ శర్మ 10 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో శిఖర్ ధవాన్, కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. అలాగే, 7.4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది.
ఇరు జట్ల వివరాలు...
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్ ఆరోన్ ఫించ్(కెప్టెన్) మార్నస్ లబుచాంజె, స్టీవెన్ స్మిత్, అస్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ, ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కానె రిచర్డ్ సన్, అడం జంపా.