బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 5 నవంబరు 2021 (13:14 IST)

టి20లో కోహ్లీ సేన సెమీస్‌కి వెళ్తుంది, ఎలాగో తెలుసా?

ప్రపంచ టి20 కప్ టోర్నీలో కోహ్లీ సేన సెమీ ఫైనలుకి వెళ్లే దారులు మసక మసకగా అగుపిస్తున్నాయి. మొన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించినప్పటికీ నేడు స్కాట్లాండ్ జట్టును భారీ తేడాతో ఓడించాలి. అంతేనా... అంటే ఇంకా వుంది. నమీబియా జట్టును చిత్తుచిత్తుగా ఓడించి భారీ స్కోరు చేయాలి.
 
ఇంకా అయిపోలేదండోయ్. అటు న్యూజీలాండ్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ జట్లు తమ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలి. అలా జరిగితేనే ఇండియా సెమీ ఫైనలుకి వెళ్లగలదు. ఐతే ఆ ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకునే వీలుంది.
 
ఇప్పటికే సెమీఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్తాన్... తన మిగిలిన మ్యాచుల్లో కావాలనే ఓడిపోతే ఇక ఇండియా ఇంటికి వెళ్లక తప్పదు. మొత్తమ్మీద కోహ్లీ సేనకు సెమీఫైనల్ ఆశలు మిణుకు మిణుకు మంటూ కనిపించే నక్షత్రంలా మారింది. ఏం జరుగుతుందో చూడాల్సిందే.