బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:52 IST)

ఫిట్‌నెస్‌లో ధోనీకి ఢోకా లేదు.. 2019 వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్ పొజిషన్ ఏంటో?

మూడు ఇన్నింగ్స్‌ల్లో 193 పరుగులు సాధించి, ప్రతి గేమ్‌లో 50 పరుగులు సాధించి, ప్రతి విజయాన్ని క్రీజులో వుండి మరి గెలిపించి.., సిరీస్ అవార్డును గెలుచుకున్న తర్వాత కూడా విమర్శలు ఎదుర్కొనే ఆటగాడు ఎవరైనా వున్నారంటే.. అది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే చెప్పాలి. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో జట్టు విజయం ధోనీ కీలక పాత్ర పోషించాడు. కానీ నెటిజన్లు, క్రీడా విశ్లేషకుల వద్ద ప్రశంసలు అందుకోలేకపోయాడు. కారణం ధోనీ బ్యాటింగ్ స్టైల్, పరుగులు తీయలేకపోవడం వంటివి ధోనీ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాయి. 
 
ఈ నేపథ్యంలో చాలామంది ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ గురించి ప్రస్తుతం చర్చ మొదలెట్టారు. 2019 ప్రపంచ కప్‌లో ధోనీ బ్యాటింగ్ పొజిషన్ గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ధోనీ వరల్డ్ కప్‌లో ఆడితే టాప్ ఆర్డర్ బెటరని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటికే ప్రపంచ కప్‌ను సంపాదించిపెట్టిన కెప్టెన్‌గా ధోనీ పేరిట రికార్డున్న తరుణంలో.. అతని సలహాలు ఫీల్డర్‌గా జట్టుకు అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ధోనీ ఇటీవల బ్యాటింగ్ విభాగంలో విఫలమవుతున్నాడు. 2015 ప్రపంచ కప్ నుంచి ధోనీ సగటు ఫ్యాన్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ధోనీ సగటు 44.45 మాత్రమే కలిగివున్నాడు. 
 
గత ఏడాది మొత్తానికి ధోనీ ఏకైక అర్థ సెంచరీని కూడా నమోదు చేయలేదు. 2018లో ధోనీ 20 మ్యాచ్‌లాడి 275 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో యావరేజ్ 25, స్ట్రైక్ రేట్ 71.42ను కలిగివున్నాడు. గత మూడేళ్ల ధోనీ బ్యాటింగ్ స్టైల్ తగ్గుముఖం పట్టింది.

అయితే బ్యాటింగ్‌లో మోస్తరుగా రాణించినా జట్టును గెలిపించడంలో ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని భారత క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకా ధోనీ 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడని.. అతని బ్యాటింగ్ స్టైల్, కీపర్‌గా వున్న అనుభవాలు, జట్టు కెప్టెన్సీలో అతని పాత్ర టీమిండియాకు కప్‌ను సంపాదించిపెడుతుందని కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ అంటున్నారు. 
 
ఎన్ని విమర్శలు ఎదురైనా 2017లో 788 పరుగులతో 60.62 యావరేజ్‌ను కలిగివున్న ధోనీకి 2019 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభిస్తుందని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఫిట్‌నెస్‌లో ధోనీకి ఢోకా లేదు. పరుగులు తీయడంలో వికెట్లను పడగొట్టడంలో ధోనీకున్న వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ కనుక వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకుంటే.. ప్రస్తుత టీమిండియా సారథికి విలువైన సలహాలు ఇస్తాడని క్రీడా పండితులు సూచిస్తున్నారు. 
 
ఇక బ్యాటింగ్ పొజిషన్ సంగతికి వస్తే.. 
ఇప్పటివరకు ధోనీ 126 సార్లు ఆరో స్థానం నుంచి బరిలోకి దిగాడు. కెప్టెన్‌గా వున్నప్పుడూ బౌలర్లకు అండగా వుండేందుకు ధోనీ ఆరో స్థానాన్ని ఎంచుకున్నాడు. తద్వారా క్లిష్ట పరిస్థితుల్లో జట్టును విజయపథం వైపు నడిపించాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ 2019లో రోహిత్ శర్మ ధోనీకి నాలుగో స్థానం ఇవ్వాలని అన్నాడు.


కెప్టెన్ కోహ్లీ ధోనీకి ఐదో స్థానం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలుంటాయని అభిప్రాయపడ్డాడు. ఏది ఏమైనా ధోనీ మాత్రం మిడిలార్డర్‌లోనే బరిలోకి దిగి.. బౌలర్లకు విలువైన సలహాలిస్తూ.. జట్టును గెలిపిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.