శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (06:54 IST)

ఐసీసీ బతుకే అంత.. ఎప్పుడూ వివక్షా పాలనే: కడిగేసిన గవాస్కర్

మైదానంలోంచి నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కేసి చూసి తన ఔట్ విషయంలో ఏం చేయాలని ప్రశ్నించిన ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఎలాంటి చర్యా తీసుకోకుండా వదిలేసిన ప్రపంచ క్రికెట్ మండలి ఐసీసీని గవాస్కర్ తూర్పారబట్టాడు.

మైదానంలోంచి నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కేసి చూసి తన ఔట్ విషయంలో ఏం చేయాలని ప్రశ్నించిన ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఎలాంటి చర్యా తీసుకోకుండా వదిలేసిన ప్రపంచ క్రికెట్ మండలి ఐసీసీని గవాస్కర్ తూర్పారబట్టాడు. ఐసీసీ కొన్ని దేశాలకు అనుకూలంగా మరికొన్నింటికి వ్యతిరేకంగా వ్యవహరించడం తగదు. ఒకవేళ స్మిత్‌లానే భారత ఆటగాడు తప్పు చేసినా అతడినీ శిక్షించకుండా వదిలేయాలి. మూడో టెస్టులో ఔటైనప్పుడు కోహ్లి కూడా స్మిత్‌లానే డ్రెస్సింగ్‌ రూం వైపు చూసి.. సాయం పొందాలని కోరుకుంటున్నా. డ్రెస్సింగ్‌ రూం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది అనవసరం. అలా చేస్తే మ్యాచ్‌ రిఫరీ ఎలా స్పందిస్తాడు.. ఐసీసీ ఎలాంటి నిర్ణయానికి వస్తుందన్నది చూడాలి’’ అని గావస్కర్‌ అన్నాడు. 
 
ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌పై ఎలాంటి చర్యలు ఉండవని తేల్చేసిన ఐసీసీపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ విరుచుకుపడ్డాడు. స్మిత్‌లానే భారత ఆటగాడు తప్పు చేస్తే ఐసీసీ వూరికే వదిలేస్తుందా అని ప్రశ్నించాడు. ‘‘స్మిత్‌ ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినా రిఫరీ (క్రిస్‌ బ్రాడ్‌)కి అదేం కనిపించలేదు. తప్పు జరుగుతోందని ఎంత మొత్తుకున్నా సమస్యేమీ లేదంటున్నాడు రిఫరీ. ఐసీసీ స్పందనను బట్టి అర్ధమవుతోంది అదే. జరిగింది తప్పు అని చెప్పాలి. అలా జరగడం లేదు. ఇది కచ్చితంగా కోహ్లి, టీమ్‌ఇండియా, బీసీసీఐని అవమానించడమే’’ అని గావస్కర్‌ మండిపడ్డాడు.
 
సమీక్ష వివాదంలో భాగమైన స్మిత్‌పై, కోహ్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసీసీ ఇప్పటికే తేల్చేసిన సంగతి తెలిసిందే. గత పదిహేనేళ్లకు పైగా ఐసీసీ పక్షపాత దృష్టిని గవాస్కర్ సందు దొరికినప్పుడల్లా ఎండగడుతున్న విషయం తెలిసిందే.