సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (17:54 IST)

రికార్డులకు చేరువలో కోహ్లీ.. కివీస్‌తో భారత్‌ మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం

వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో మైదానాలన్నీ చిత్తడిగా మారిపోతున్నాయి. దీంతో నేటి భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా మారింది.


ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే చెరో పాయింట్‌ లభిస్తుంది.
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించేందుకు విరాట్ కోహ్లీ 57 పరుగుల దూరంలో వున్నాడు.

ఇప్పటికే అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ ఈ రికార్డును ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులతో కొనసాగుతున్నాడు.
 
కోహ్లీ 11వేల పరుగులు పూర్తి చేస్తే.. భారత్ తరఫున ఇన్ని పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్ అవుతాడు. ప్రపంచ క్రికెట్‌లో తొమ్మిదవ క్రికెటర్‌గా రికార్డు సాధిస్తాడు.

భారత్ తరఫున ఇప్పటి వరకు గంగూలీ, సచిన్ మాత్రమే ఈ ఫీట్‌ నమోదు చేశారు. ఇక, మరో సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా సెహ్వాగ్, పాంటింగ్ సరసన చేరతాడు.