గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (16:53 IST)

ఇమ్రాన్ సలహాను పాటించని సర్ఫరాజ్... ఇండియానే ఫేవరేట్ అంటున్న పాక్ ప్రధాని

భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతోంది. అలాంటి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు రచించాలి. ఎలా ప్రవర్తించాలన్నదానిపై ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారు. ఈ సలహాను పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఏమాత్రం పట్టించుకోలేదు. సర్ఫరాజ్ టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోవాలని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సూచన చేశారు. కానీ, సర్ఫరాజ్ మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. 
 
నిజానికి పాకిస్థాన్ టాస్ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్ చేయాల‌ని ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. కానీ స‌ర్ఫ‌రాజ్ మాత్రం దానికి భిన్నంగా బౌలింగ్ ఎంచుకోవడం ఇపుడు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఓ మైండ్ గేమ్. ఈ మాట అన్న‌ది కూడా ఇమ్రానే. లెజెండ్ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ అభిప్రాయాల్ని పాక్ టీమ్ ప‌క్క‌న పెట్టిందా. పాకిస్థాన్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ సూచ‌న‌ల‌ను ఆ జ‌ట్టు ఎందుకు పాటించ‌లేదో. ఇదో మైండ్ గేమ్ అనుకోవాలా. ఓడిపోతామ‌న్న భ‌యాన్ని మెద‌డు నుంచి తీసేస్తే.. విజ‌యం వ‌రిస్తుంద‌ని ఇమ్రాన్ త‌న ట్వీట్‌లో చెప్పారు. 
 
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సంద‌ర్భంగా.. ఇమ్రాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ హై టెన్ష‌న్ మ్యాచ్‌పై అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఇవాళ మాంచెస్ట‌ర్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. నిజానికి ఫ‌స్ట్ బౌలింగ్ జ‌ట్టుకే ఎక్కువ విజ‌యావ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్క‌డ కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షం వ‌ల్ల పిచ్ ముద్ద‌గా త‌యారైంది. టాస్ విష‌యంలో స‌ర్ఫ‌రాజ్ త‌ప్పు చేశాడేమో.. కానీ ఇమ్రాన్ మాత్రం భారతే ఫెవ‌రేట్ అన్న ట్వీట్‌ను కూడా చేశారు.