గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 జులై 2022 (13:46 IST)

యువతితో ఏకాంతంగా వర్థమాన నటుడు:. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన నటి

couple
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వర్థమాన నటి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమెపై కేసు నమోదయింది. తనతో పాటు ఇండస్ట్రీలో పనిచేసే ఓ వర్ధమాన నటుడు మరో యువతితో ఏకాంతంగా వుండగా సదరు సినీ నటి వీడియోలో బంధించింది.

 
ఆ వీడియోను అతడికి పంపి... ఆ దృశ్యాలను బయటపెట్టకుండా వుండాలంటే తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనితో ఏం చేయాలో తెలియని వర్థమాన నటుడు ఎస్.ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తనను డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న నటిపై ఫిర్యాదు చేసాడు.