సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:53 IST)

ఒంటరిగా నిద్రిస్తున్న బాలిక, మంచంపై దుప్పట్లో దూరిన కామాంధుడు..

ఆ బాలికకు 8 యేళ్ళ వయస్సు. బయట మంచంపై పడుకుని నిద్రిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం ఇంటి లోపల నిద్రిస్తున్నారు. ఇంటి పక్కన వారు అందరూ బయటే పడుకుని ఉండడంతో తల్లిదండ్రులు కూడా తన కుమార్తె బయట పడుకున్నా భద్రంగానే ఉంటుందనుకున్నారు. అయితే అదే వాళ్ళు చేసిన తప్పుగా తరువాత తెలుసుకున్నారు.

 
చిత్తూరు రోసినగర్‌కు చెందిన బాలిక నిన్న రాత్రి ఒంటరిగా ఇంటి బయట నిద్రపోతోంది. సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో అదే ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నాగరాజు అనే వ్యక్తి మెల్లగా మంచం ఎక్కాడు. అరగంట పాటు మంచం మీదే చడీచప్పుడు చేయకుండా పడుకున్నాడు.

 
ఆ తరువాత మెల్లగా ఆ బాలికపై చెయ్యేశాడు. గాఢ నిద్రలో ఉన్న బాలిక గుర్తించలేకుండా పోయింది. అయితే నాగరాజు చేష్టలు మితిమీరడంతో ఆమెకు మెలుకువ వచ్చింది. గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించగా నాగరాజు నోరు మూసేశాడు. దీంతో ఎలాగోలా ప్రతిఘటించి పక్కనే ఉన్న ఇంటి వారిని లేపింది బాలిక.

 
దీంతో నాగరాజు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగరాజు ఆకృత్యాలతో బాలికకు ఒంటిపై గాయాలు కూడా అయ్యాయి.