ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (18:54 IST)

కామాంధ పూజారి: నే వచ్చాకే పూజ, స్నానాదికాలు చేయలంటాడు, స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తాడు

అతను ఒక ఆలయానికి పూజారి. ఎంతో నియమంగా ఉండేవాడు. గ్రామస్తులు ఆలయాన్ని నిర్వహిస్తున్నా.. పూజారికి తక్కువ డబ్బులు ఇస్తున్నా అతను మాత్రం ఆలయానికి తరచూ వచ్చేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేసేవాడు. పూజారి ఎంతో మంచి వాడనుకున్న గ్రామస్తులు అతని నిజస్వరూపం తెలిసి షాకయ్యారు. తేరుకోలేని పరిస్థితికి వెళ్లిపోయారు.

 
తమిళనాడు రాష్ట్రం తిరువూర్ జిల్లాలోని మడతకులం సమీపంలోని కనియూరు అగ్రహారం రోడ్డులో నివాసముంటున్నాడు బాలాజీ అలియాస్ బాలాజీస్వామి. ఆయన వయస్సు 48 యేళ్ళు. హుందాగా కనిపిస్తూ ఉంటాడు.  స్థానికంగా ఉన్న శ్రీకాళీయమ్మాన్ ఆలయంలో పూజారి ఆలయన. ఈ ఆలయాన్ని స్థానికంగా ఉన్న గ్రామస్తులే చందాలు వేసుకుని నడుపుకుంటూ ఉన్నారు. ఆలయ పూజారికి నెల నెలా తక్కువ డబ్బులే ఇస్తుంటారు.

 
అయితే బాలాజీస్వామి మాత్రం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వస్తూ.. వెళుతూ పూజలు చేసేవాడు. దీంతో ఆ పూజారిని ఇంటికి పిలిపించుకుని హోమాలు, వ్రతాలు చేయించుకునేవారు మహిళలు. హోమం, వ్రతం చేసే సమయంలో స్నానాది కార్యక్రమాలు తను వచ్చి పూజకు అంతా సిద్థం చేసిన తరువాతనే చేయాలనేవాడు స్వామీజీ. ఇలా ఆ స్వామీజీ మాటలను నమ్మారు. పూజా సమయంలో ఇంట్లో మహిళలు తప్ప ఇంకెవరూ ఉండకూడదని షరతులు పెట్టేవాడు. 

 
మహిళలు అది నిజమని నమ్మారు. అతను చెప్పినట్లు పూజ కోసం వెళ్ళి స్నానం చేస్తున్న యువతులు, మహిళల నగ్న వీడియోలను తీసేవాడు. వాటిని కొంతమందికి విక్రయించేవాడు. ఇది కాస్త అలాఅలా సోషల్ మీడియాలో వచ్చేశాయి. చాలామంది అదే గ్రామానికి చెందిన మహిళలు, యువతుల వీడియోలు ఉండటంతో అందరూ అలెర్ట్ అయ్యారు. దీనికి కారణం ఎవరోనని పోలీసులను ఆశ్రయించారు. రహస్యంగా విచారణ చేపట్టిన పోలీసులు బాలాజీస్వామిని అదుపులోకి తీసుకున్నారు.

 
అతని మొబైల్‌తో పాటు ఇంట్లోని ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుంటే అసలు విషయం బయటపడింది. 100 మందికి పైగా యువతులు, మహిళల నగ్న వీడియోలు ఒక్కసారిగా బయటపడి నిందితుడని తేలడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.