ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (12:38 IST)

సెల్ఫీ పేరుతో చెట్టుకు కట్టేసి నిప్పు అంటించిన భార్య.. ఎక్కడ?

rtcbus catch fire
సెల్ఫీ పేరుతో ఓ భర్తకు కట్టుకున్న భార్య నిప్పు అంటించింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వాసుదేవ్‌పుర్‌ సరాయ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ.. సెల్ఫీ తీసుకుందామంటూ శనివారం రాత్రి భర్తను ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. 
 
ఆ తర్వాత భర్తను చెట్టుకు కట్టేసింది. కేకలు వేయకుండా ఉండేందుకు బాధితుడి నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత అతడి ఒంటిపై కిరోసిన్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగడంతో గ్రామస్థులు వచ్చి ఆర్పారు. 
 
బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. మహిళకు గ్రామంలో మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు.  పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.