శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 జులై 2023 (13:21 IST)

బెంగుళూరులో దారుణం : ఏరోనిక్స్ కంపెనీ ఎండీ, సీఈవో దారుణ హత్య

murder
దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనేక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్‌లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హత్య చేశాడు. హద్దుమీరి కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్... తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వీరిద్దరిని నరికాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిద్దరూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ఫెలిక్స్ పరారీలో ఉన్నాడు. 
 
కాగా, బెంగుళూరులోని అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్‌టెన్షన్‌లో ఈ కంపెనీ ఉంది. అయితే, ఫెలిక్స్ కూడా ఇటువంటి కంపెనీనే నిర్వహిస్తున్నాడు. తన బిజినెస్‌కు ఎరోనిక్స్ ఎండీ, సీఈవోలు ఆటంకం కలిగించడం వల్లే ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బెంగుళూరు డీసీపీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.