గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:25 IST)

మహిళతో నలుగురు యువకులు, లోపలికెళ్లే విషయంలో ఒకరు హత్య

కోయంబత్తూరులోని లాడ్జిలో ఒక యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ముగ్గురు స్నేహితులు కలిసే అతన్ని దారుణంగా చంపేశారు. అది కూడా ఒక మహిళతో ఎంజాయ్ చేసే విషయంలోనే. మెట్టపాళ్యెంలోని చిన్నమ్మ లేఅవుట్‌కు చెందిన లెనెన్ ప్రాంక్లిన్, దినకరన్, అరుణ్, ప్రవీణ్ కుమార్‌లు స్నేహితులు.
 
వీరు వేర్వేరుగా పనులు చేస్తున్నారు. రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు నెలకు ఒక మహిళతో ఎంజాయ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. బాగా మద్యం సేవించి ఎంజాయ్ చేయడం అలవాటుగా మారింది. 
 
కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జిని బుక్ చేసుకుని ఆ మహిళతో లోపలికి వెళ్ళారు నలుగురు. కానీ లోపలకు వెళ్ళే సమయంలో ప్రాంక్లిన్ ముగ్గురితో గొడవపడ్డాడు. వీరి మధ్య గొడవ కాస్తా పెద్దది కావడం ఒకరినొకరు తోసుకున్నారు.
 
ఈ తోపులాట్లో ప్రాంక్లిన్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. భయపడి ముగ్గురు స్నేహితులతో పాటు ఆ మహిళ కూడా పరారైంది. నిందితులను కోయంబత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.