గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జులై 2023 (14:10 IST)

స్నేహితుడి కళ్లెదుటే బాలికపై సామూహిక అత్యాచారం ... ఎక్కడ?

accused
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. స్నేహితుడి కళ్లెదుటే ఓ 17 యేళ్ల బాలికపై ముగ్గురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం బాధితురాలు తన స్నేహితుడితో కలిసి అజ్మీర్ నుంచి బస్సులో జోధ్‌పూర్‌కు బయలుదేరింది. వారిద్దరూ జోధ్‌పూర్ చేసుకునేసరికి రాత్రి 10.30 గంటల సమయమైంది. దీంతో గది కోసం ఓ గెస్ట్ హౌస్‌కు వెళ్లగా, ఆ గెస్ట్ హౌస్ కేర్‌టేకర్ ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
దీంతో వారిద్దరూ అక్కడ నుంచి బయటకు వచ్చేసి.. పౌటా చౌరాహా అనే ప్రాంతానికి వెళ్లగా, అక్కడ వారికి సమందర్ సింగ్ భాటీ, ధర్మపాల్ సింగ్, భట్టమ్సింగ్ అనే ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వీరంతా 20 నుంచి 22 యేళ్లలోపువారే. బాలిక, ఆమె స్నేహితుడికి సాయం చేస్తామని నమ్మబలికారు. ఆహారంతో పాటు గదిని ఇప్పిస్తామని చెప్పి దుహాన్‌లోని రైల్వే స్టేషన్‌కు తీసుకెళతామని చెప్పడంతో వారి మాటలు నమ్మి వారి వెంట నడిచారు. 
 
అలా తెల్లవారుజామున 4 గంటల సమయంలో జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీ ఓల్డ్ క్యాంపస్‌లో ఉన్న హాకీ మైదానంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలి స్నేహితుడిని చితకబాది... అతని ముందే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటికే తెల్లవారడంతో ఉదయం వేళ వాకింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో నిందితులంతా అక్కడ నుంచి పారిపోయారు. 
 
నిస్సహాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ చూసిన మార్నింగ్ వాకర్లు పోలీసులకు సమాచారం ఇ్చచారు. దీంతో అక్కడు చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించి కిందపడటంతో ఇద్దరి కాళ్లు విరిగిపోగా, మరొకరికి గాయాలైనట్టు దుహాన్ డీసీపీ వెల్లడించారు. నిందితులంతా కాలేజీ విద్యార్థులని చెప్పారు.