శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (10:20 IST)

నూలుపోగులేకుండా వీడియో కాల్ చేసిన ప్రియురాలు... రికార్డు చేసి వరుడికి పంపిన ప్రియుడు

video
ప్రియుడి కోరిక మేరకు న్యూడ్ వీడియో కాల్ చేసిన ప్రియురాలు ఇపుడు సమస్యల్లో చిక్కుకోవడమే కాకుండా పరుగుపోగొట్టుకుంది. ఆ వీడియో కాల్‌ను రికార్డు చేసిన ప్రియుడు... తన ప్రియురాలికి కాబోయే భర్తకు పంపించాడు. దీంతో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు వరుడు నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేశారు. కృష్ణ జిల్లా గుడివాడలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వివరాలను పరిశీలిస్తే, 
 
గుడివాడకు చెందిన ఓ యువతికి కర్నా న్యూటన్ బాబు అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ స్నేహం ముదిరి వారి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో ఓ రోజున ప్రియుడి కోరిక మేరకు.. ప్రియురాలు నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇదే అదునుగా భావించిన న్యూటన్ బాబు... తన ప్రియురాలి న్యూడ్ వీడియోను సేవ్ చేశాడు. 
 
ఈ క్రమంలో ఆ యువతికి మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. ఎలాగో పెళ్ళి చేసుకోబోతున్నానని భావించిన ఆ యువతి.. తన ప్రియుడికి శారీరక సుఖం ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 14వ తేదీన ఆ యువతి పెళ్లి జరగాల్సివుంది. అయితే, న్యూటన్ బాబు తన వద్ద వీడియోను వరుడు పరంజ్యోతికి పంపించాడు. ఆ వీడియోను తాను చూడటమే కాకుండా, పెద్దలకు కూడా చూపించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో రంగంలోకి దిగిన పెళ్లి పెద్ద.. ఆ వీడియోను వధువు కుటుంబ సభ్యులకు చూపించి పెళ్లి రద్దు చేశాడు. 
 
ఇదిలావుంటే, న్యూటన్ బాబు ఈ వీడియోను తన బంధువులకు కూడా పంపించాడు. వారి బాపట్ల కోటేశ్వర రావు, కొండ్రు రణధీర్‌లు మరికొందరికీ షేర్ చేశారు. అలా ఆ వీడియో కాస్త షేర్ అయింది. ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అందరిపై కేసు నమోదు చేశారు. సూత్రధారి అయిన న్యూటన్‌బాబుపై అత్యాచారయత్నం, పెళ్లికి నిరాకరించిన పరంజ్యోతిపై అత్యాచార యత్నం, పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి, కోటేశ్వర రావు, రణధీర్‌లపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.