శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:13 IST)

పక్కింటి మహిళకు మ్యాచింగ్ చెప్పే క్రమంలో క్లోజయ్యాడు, భరించలేని భార్య ఆ పని చేసింది

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందరితోను కలివిడిగా ఉంటాడు. అపార్టుమెంటులో 25 కుటుంబాలు ఉంటే అందరికీ ఈయన బాగా పరిచయం. ముఖ్యంగా మ్యాచింగ్ చెప్పడంతో ఆయనకు ఆయనే సాటి.


దీంతో చాలామంది మహిళలు ఆయన దగ్గరకు వచ్చి చీరలకు మ్యాచింగ్‌లు, వారి శరీర ఆకృతికి ఎలాంటి చీర, చుడిదార్లు వేసుకుంటే బాగుంటుంది అడిగి వెళ్ళేవారు. ఇదే అతని కుటుంబం సర్వనాశనం కావడానికి కారణమవుతుందని అతను ఊహించలేకపోయాడు. 

 
మహారాష్ట్ర పూణే సిటీలోని మోషి చిఖాలీ రోడ్డులో నివాసముంటున్నారు మొహ్సిన్ అజీమ్ జాకీర్ హుస్సేన్ షేక్, రజియా బేగం. పది సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. ఒక కుమార్తె ఉంది. ఎంతో హాయిగా సాగిపోతున్న జీవితం. ప్రభుత్వ ఉద్యోగి జాకీర్. ఒక అపార్టుమెంటులో ఉంటున్నాడు.

 
అందరితోను సరదాగా ఉండే జాకీర్‌కు మహిళల మ్యాచింగ్ గురించి బాగా తెలుసు. ఇలా చాలామందికి సలహాలు ఇస్తుంటాడు. భార్య మొదట్లో దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుంది. కానీ అపార్టుమెంటులో చాలామంది మహిళలతో తన భర్త సన్నిహితంగా ఉండటం మాత్రం జీర్ణించుకోలేకపోయింది.

 
ముఖ్యంగా తాను ఉంటున్న ఫ్లాట్ పక్క పోర్షనులో నివాసముండే రమ్యతో మరింత క్లోజ్‌గా ఉండేవాడు. చాలాసార్లు ఇది కరెక్ట్ కాదని భార్య చెప్పింది. గత ఆరు నెలల నుంచి వీరి మధ్య అదే గొడవ. ఎన్నిసార్లు సద్దుమణిగించాలని చూసినా భర్త వల్ల అది సాధ్యం కాలేదు. 

 
ఈ నేపథ్యంలో భార్య మనస్థాపానికి గురైంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను ఒక లేఖలో రాసింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.