మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: బుధవారం, 11 ఆగస్టు 2021 (15:13 IST)

భార్య శృంగారం చేయమన్నందుకు బావిలో దూకేసాడు

పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నారు. భార్య అనారోగ్యంతో చనిపోయింది. పిల్లలను చూసుకునేందుకు రెండవ పెళ్ళి చేసుకున్నారు. ఆమెకు 28 యేళ్ళు, ఇతనికి 52 యేళ్ళు. పిల్లలు కావాలి.. గంటల తరబడి శృంగారం చేయాలంటూ రెండవ భార్య తరచూ వేధిస్తూ ఉండేది. అయితే ఉన్న ఇద్దరు పిల్లలను చూసుకోమని చెబుతూ ఉండేవాడు భర్త. కానీ చివరకు రెండవ భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
 
శ్రీకాకుళంలోని మెరకవీధికి చెందిన భాస్కర్ రావుకు సోంపేటకు చెందిన ఒక మహిళతో 22 యేళ్ళ క్రితమే వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమధ్య అనారోగ్యంతో భార్య చనిపోయింది. పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. 
 
అయితే వీరిని చూసుకునేందుకు రెండవ పెళ్ళి ఇష్టం లేకపోయినా చేసుకున్నాడు భాస్కర్ రావు. గత యేడాది 25వ తేదీ వెంకటరత్నమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 28 యేళ్ళు. పెళ్ళయినప్పటి నుంచి భర్తతో ఎక్కువ సేపు గడపాలన్నది ఆమె ఆలోచన.
 
భర్తతో తరచూ ఇదే విషయంపై గొడవ పడుతూ ఉండేది. ఎక్కువసేపు శృంగారం చేయాలి.. పిల్లలు కనాలి అంటూ భర్తతో తరచూ గొడవకు దిగేది. ఎదిగిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పిల్లలెందుకు.. శృంగారం ఎక్కువ సేపు చేసేంత వయస్సు నాది కాదంటూ భర్త చెబుతూ వచ్చేవాడు.
 
దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. చివరకు భార్య టార్చర్ తట్టుకోలేక భర్త తన ఇంటికి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పిల్లల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి రెండవ భార్యను అదుపులోకి తీసుకున్నారు.