శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (15:19 IST)

స్నేహితుడి భార్యపై కన్నేసి... రూ.16 లక్షలు వసూలు చేసిన కేటుగాడు

హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ మృగాడు.. ఆమె నుంచే ఏకంగా రూ.16 లక్షలు వసూలు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తి తనను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ స్నేహితుడి భార్యను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె భయపడిపోయి ప్రశాంత్ మాయలో పడిపోయింది. 

ఆ తర్వాత ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే వీడియోలు తీశాడు. ఆ తర్వాత గానీ అతని నిజస్వరూపం ఆమెకు తెలియరాలేదు. ఆ వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌ చేశాడు. 
 
డబ్బు ఇవ్వకపోతే వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పటికే బాధితురాలి దగ్గర నుంచి రూ.16 లక్షలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.